గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 అక్టోబరు 2021 (16:57 IST)

ప్రీతమ్ సమంత మధ్య ఆ బంధం.. తెలివి లేని వాళ్ల కోసం..?

టాలీవుడ్ స్టార్స్ సమంత- నాగచైతన్య వివాహ బంధానికి విడాకులతో బ్రేక్ పడింది. ఇక ఈ వార్తను ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు ఫ్యాన్స్. ఈ జంట విడాకులు తీసుకోవడానికి కారణాలేంటన్న దానిపై సోషల్ మీడియాలో వేదికగా పలువురు వెతికే పనిలో పడ్డారు. 
 
ఈ క్రమంలోనే సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ ఓ కారణమని.. అతడిని నిందిస్తూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దీనిపై తాజాగా సమంత పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్ స్పందించింది.
 
సమంత-ప్రీతమ్‌ల మధ్య ఉన్న బంధాన్ని అందరూ తప్పుగా అర్ధం చేసుకుంటున్నారని సాధనా సింగ్ ఆవేదన వ్యక్తం చేసింది. సమంతను.. ప్రీతమ్ అక్క(జీజీ) అని పిలుస్తాడు. జీజీ అంటే అర్ధం తెలుసు కదా అంటూ ట్రోలర్స్‌కు గట్టిగా బదులిచ్చింది. తెలివిలేని వాళ్ల కోసం దీన్ని షేర్ చేస్తున్నానని గట్టిగా షాకిచ్చింది.