సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వసుంధర
Last Modified: ఆదివారం, 10 అక్టోబరు 2021 (17:22 IST)

Samantha ఏంటి మీకు డబ్బు వద్దా అంటూ ఎన్టీఆర్, కావాలి కావాలి అంటున్న సమంత

ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రారంభమైంది కానీ ఎక్కడో తంతుందన్నయ్యా అన్నట్లుగా సాగుతోంది. ఎంత తన్నుకుంటున్నా టీఆర్పీ రేటు పెరగటంలేదట. దాంతో వరసబెట్టి సెలబ్రిటీలను దించుతున్నారు.

 
ఓపెనింగ్ ఎపిసోడుకి చెర్రీ వస్తే ఆ తర్వాత జక్కన్న, కొరటాల శివ వచ్చారు. ఇప్పుడు తాజాగా స్టార్ హీరోయిన్ సమంతను తీసుకొస్తున్నారు. దసరా ఎపిసోడ్లో సమంత కనబడుతుంది. ఈ ఎపిసోడ్ ప్రొమో చూస్తే... హాట్ సీటుపైన సమంత అంటూ ఎన్టీఆర్ అన్నారు. ఆ తర్వాత గేంలో 1000 నుంచి కోటికి కాకుండా కోటి నుంచి వెయ్యికి వస్తే సవాలుగా వుంటుంది కదా అన్నాడు ఎన్టీఆర్. నాకలా వద్దనగానే మీకు డబ్బు వద్దా అని ఎన్టీఆర్ అనగానే కావాలి కావాలి అంటూ సమంత చెప్పింది.

 
ఇకపోతే.. విడాకులు తీసుకున్న తర్వాత తొలిసారిగా సమంత ఎవరు మీలో కోటీశ్వరులు షోతో తొలిసారిగా కనబడుతోంది. మరి ఈ షో మొత్తం ఎలా వుంటుందో చూడాలంటే దసరా ఎపిసోడ్ కోసం ఎదురుచూడాల్సిందే.