మంగళవారం, 27 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 అక్టోబరు 2021 (10:58 IST)

భార్య మరణాన్ని జీర్ణించుకోలేని భర్త.. పిల్లలకు విషమిచ్చి...

కట్టుకున్న భార్య భౌతికంగా దూరంకావడాన్ని భర్త జీర్ణించుకోలేకపోయాడు. దీంతో తన నలుగురు పిల్లలతో పాటు.. తాను కూడా విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన ఈ ఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లా బోరగల్‌ గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ ప్రాంతానికి చెందిన గోపాల్‌ అనే వ్యక్తి భార్య జయ (42) జులై 6న బ్లాక్‌ ఫంగస్‌ కారణంగా కన్నుమూశారు. అప్పటినుంచి మనస్తాపానికి గురైన గోపాల్‌ శుక్రవారం పిల్లలతో పాటు తానూ విషం తీసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను ఇంటి పెద్ద గోపాల్‌ హాదిమని (48), పిల్లలు సౌమ్య(19), శ్వేత(16), సాక్షి (11), సృజన్‌ (8)గా గుర్తించారు. 
 
కాగా, గోపాల్‌ కొంత కాలం కిందటే సైన్యం నుంచి ఉద్యోగ విరమణ చేశారు. సంకేశ్వర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రాష్ట్ర సీనియర్‌ మంత్రి గోవింద కారజోళ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో బాధలెన్ని ఎదురైనా ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవద్దని ఆయన ప్రజలకు హితవు పలికారు.