గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 నవంబరు 2021 (10:24 IST)

దేశంలో కొత్తగా మరో 12514 కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కొత్తగా మరో 12514 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఈ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. తాజాగా మహమ్మారి నుంచి 12,718 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్‌ బారినపడి 24 గంటల్లో 251 మంది మృత్యువాతపడ్డారు. 
 
కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,42,85,814కు పెరిగాయి. ప్రస్తుతం 1,58,817 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు 3,36,68,560 మంది బాధితులు కోలుకున్నారు. 
 
వైరస్‌ ప్రభావంతో మొత్తం 4,58,437 మంది మృతి చెందారు. మరో వైపు దేశంలో టీకాల పంపిణీ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 1,06,31,24,205 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది.