సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 31 అక్టోబరు 2021 (22:35 IST)

111 రన్స్ టార్గెట్‌ను ఉఫ్ అంటూ ఊదేసిన కివీస్ ఆటగాళ్లు... భారత్‌కు చిత్తు

దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా బ్యాటింగ్ వైఫల్యం కొనసాగింది. భారత్ ఉంచిన 110 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ ఆటగాళ్లు ఉఫ్ మంటూ ఉదేశారు. కేవలం 2 వికెట్లు కోల్పోయి 8 వికెట్ల తేడాతో విజయభేరీ మోగించారు. ఫలితంగా మరో 33 బంతులు మిగిలివుండగానే గెలుపును తన ఖాతాలో వేసుకుంది. 
 
కివీస్ ఓపెనర్లు మార్టిన్ గుప్తిల్ (20), మిచెల్ (49) మంచి పునాది వేయగా, ఆ తర్వాత వచ్చిన విలియమ్సన్ 33, డేవాన్ కాన్వే 2 పరుగుల చొప్పున చేయడంతో కివీస్ జట్టు సునాయాసంగా గెలుపొందింది. 
 
అంతకుముందు ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 110 పరుగులు చేసింది. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రవీంద్ర జడేజా చేసిన 26 పరుగులే అత్యధికం. హార్దిక్ పాండ్య 23 పరుగులు చేశాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ 18 పరుగులు చేసి అవుట్ కాగా, వన్ డౌన్‌లో వచ్చిన రోహిత్ శర్మ 14 పరుగులతో సరిపెట్టుకున్నాడు.
 
కెప్టెన్ విరాట్ కోహ్లీ 9 పరుగులు చేసి నిరాశపర్చగా, ఓపెనర్‌గా దిగిన ఇషాన్ కిషన్ (4) అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. భారీ హిట్టింగ్ చేస్తాడని భావించిన రిషబ్ పంత్ (12)ను మిల్నే బౌల్డ్ చేయడంతో ఆ ఆశలు కూడా ఆవిరయ్యాయి.
 
న్యూజిలాండ్ బౌలింగ్ మరీ అంత ప్రమాదకరంగా ఏమీ లేకపోయినా, భారత ఆటగాళ్లు పేలవ షాట్లతో వికెట్లు పారేసుకున్నారు. కివీస్ బౌలర్లలో లెఫ్టార్మ్ సీమర్ ట్రెంట్ బౌల్ట్ 3, లెగ్ స్పిన్నర్ ఇష్ సోధీ 2, టిమ్ సౌథీ 1, ఆడమ్ మిల్నే 1 వికెట్ తీశారు. మొత్తంమీద భారత్ ఖాతాలో మరో ఓటమిని చేరింది. కాగా, ఐసీసీ ఈవెంట్లలో కివీస్ జట్టును భారత్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడించలేకపోవడం గమనార్హం.