బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 10 నవంబరు 2021 (15:14 IST)

బెజ‌వాడ స్టేడియంలో చెత్త‌... క్రీడాకారుల నిర‌స‌న‌

దీనిపై అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సంబంధిత అధికారులు ఒక వారం రోజుల్లో చెత్త వాహనాలు తరలిస్తామని మాటిచ్చారు. కానీ ఆచరణలో ఆ పని చేయకపోగా, ఈరోజు ఉదయం క్రీడాకారులు వాకర్స్ ని గేటు ముందు అడ్డుకొని లోపలకి రానీయకుండా చేశారు.


వెంటనే మమ్మల్ని లోపలికి పంపించాలని గేటు ముందు క్రీడాకారులు వాకర్స్ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో డివైఎఫ్ఐ సెంట్రల్ సిటీ నాయకులు ఎస్కె నిజాముద్దీన్ ఎస్.కె పిరు పాల్గొన్నారు. ఆయ‌న మాట్లాడుతూ, స్టేడియం ఏర్పాటు చేసి ఇన్ని సంవత్సరాల్లో అవుతున్నా ఇప్పటివరకు ఎవరు స్టేడియం లోపలకి రావద్దని అడ్డుకోలేదన్నారు. కార్పొరేషన్ అధికారులు ఇలా ఇప్పుడు అడ్డుకోవడం సరికాదన్నారు. రోజుకు 300 నుంచి 500 మంది స్టేడియంలో వాకర్స్ క్రీడాకారులు పాల్గొంటారని ఇలా అడ్డుకోవడం కార్పొరేషన్ అధికారులు కి ప్రభుత్వానికి తగదని అన్నారు.


ఆర్.ఎఫ్.ఓ ఫోన్లో మాట్లాడుతూ, రెండు రోజుల్లో స్టేడియం లోపల ఉన్న చెత్త వాహనాలు తొలగిస్తామని హామీ ఇవ్వడంతో అధికారుల మాటకి గౌరవం ఇచ్చే క్రీడాకారులు వాకర్స్ రెండు రోజుల్లో తీసేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు మహేష్, మళ్లీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.