1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 19 నవంబరు 2021 (11:00 IST)

అప్పు తీసుకున్నారు, అడుగుతుంటే బెదిరిస్తున్నారు: నటి స్నేహ పోలీసు స్టేషన్లో కేసు

ముత్యాల్లాంటి పలు వరుసతో నవ్వులు పూయించే స్నేహ పోలీసు స్టేషన్ మెట్లెక్కారు. ఇద్దరు వ్యాపారవేత్తలపై ఆమె కేసు పెట్టారు.

 
వివరాల్లోకి వెళితే... తన వద్ద వ్యాపారం నిమిత్తం ఇద్దరు పారిశ్రామికవేత్తలు 26 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారని తెలిపింది. ఆ అప్పుకి వడ్డీ ఇవ్వమని అడిగితే చెల్లించడం లేదనీ, పైగా అసలు ఇవ్వకుండా అడిగితే బెదిరిస్తున్నారని ఆమె చెన్నైలోని కానత్తూర్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది.

 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా స్నేహ సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నటించింది. ప్రస్తుతం అడపాదడపా చిత్రాల్లో నటిస్తోంది.