1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Kollywood Actor Simbu breaks into tears on Stage

ఇబ్బందులు పెడుతున్నారంటూ కన్నీరు పెట్టుకున్న హీరో శింబు

Simbu
హీరోయిన్ నయనతార మాజీ ప్రియుడు, తమిళ హీరో శింబు వేదికపై కన్నీరు పెట్టుకున్నారు. కొందరు తనను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారంటూ తీవ్ర భావోద్వేగానికిలోనై కళ్లు చెమర్చారు. ఈ ఘటన గురువారం తాను నటించిన మనాడు చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చోటుచేసుకుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులంతా తమతమ ప్రసంగాలను పూర్తి చేశారు. ఆ తర్వాత చివరంగా హీరో శింబు మాట్లాడారు. ప్రారంభంలో సరదాగానే మాట్లాడిన శింబు తన ప్రసంగం ముగింపు సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 
 
"తనను కొందరు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారనీ, వారి సంగతి నేను చూసుకుంటాను.. నన్ను మాత్రం మీరు (ఫ్యాన్స్) చూసుకోవాలంటూ" ఈ వేడుకకు హాజరైన అభిమానలకు విజ్ఞప్తి చేశారు.
 
దీంతో అప్పటివరకు ఎంతో సరదాగా సాగిన కార్యక్రమం ఒక్కసారిగా నిశ్శబద్ధంగా ఆవహించింది. ఆ తర్వాత వేదికపై ఉన్న నిర్మాతలు కె.రాజన్, సురేష్ కామాక్షి, సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా, చిత్ర దర్శకుడు వెంకట్ ప్రభు, యువ నటుడు మహత్ రాఘవేంద్ర వంటివారు శింబును ఓదార్చారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
శింబు కంట‌త‌డి - ఓదార్చిన స్నేహితులు ఎందుకో తెలుసా!