గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 ఆగస్టు 2021 (20:16 IST)

శింబు 'ఈశ్వరన్‌'లోని మాంగల్యం పాట వైరల్

simbu
కోలీవుడ్‌ మోస్ట్‌ బ్యాచిలర్‌ హీరో శింబు 'ఈశ్వరన్‌' చిత్రంలోని 'మాంగల్యం' అనే పాట యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ యేడాది సంక్రాంతికి శింబు నటించిన 'ఈశ్వరన్‌' చిత్రం విడుదలైంది. సుశీంద్రన్‌ తెరకెక్కించిన ఈ చిత్రం షూటింగు కేవలం నెల రోజుల్లోనే పూర్తి చేశారు. 
 
దీనికి కారణం హీరో శింబు సహకారమే అంటూ దర్శకుడు సుశీంద్రన్‌ సహా ఇందులో ఓ కీలక పాత్ర పోషించిన సీనియర్‌ దర్శకుడు భారతీరాజా ఈ మూవీ ఆడియో రిలీజ్‌ వేడుకల్లో చెప్పారు. అలాగే, వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో 'మానాడు'లో నటించారు.
 
ఈ చిత్రాన్ని కూడా శింబు నిర్ణీత షెడ్యూల్‌లోనే పూర్తి చేసి ప్రతి ఒక్కరినీ అబ్బురపరిచారు. ప్రస్తుతం స్టార్‌ దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ దర్శకత్వంలో 'వెందు తణిందదు కాడు' అనే చిత్రంలో నటిస్తున్నారు. అయితే, నిర్మాతలకు సరైన సహకారం అందించని వ్యవహారం తమిళ చలన చిత్ర నిర్మాతల మండలి వద్ద పంచా యితీ జరిగింది. 
 
దీనికి శింబు తల్లి ఉషా రాజేందర్‌ తాజాగా హాజరై వివరణ ఇచ్చారు. ఇదిలావుండగా 'మాంగల్యం' పాటను ఇప్పటికే 150 మిలియన్ల మంది వీక్షించారు. గతంతో శింబు నటించిన ఏ చిత్రంలోని పాట ఈ రేంజ్‌లో ఆదరణ పొందిన దాఖలా లేకపోవడం గమనార్హం.