శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 జనవరి 2021 (10:35 IST)

పుట్టిన రోజు.. ఇంటి వద్దకు రాకండి.. శింబు ఫ్యాన్సుకు విజ్ఞప్తి

"ఫిబ్రవరి 3న నా పుట్టినరోజును మీతో జరుపుకోవాలని అనుకున్నాను. కానీ ఎప్పటి నుంచో ఓ చోటుకి వెళ్లాలని ప్లాన్‌ చేసుకున్నాను. అలా ఈ పుట్టినరోజుకు అక్కడికి వెళ్తున్నాను. ఆరోజు నేను నగరంలో ఉండడం లేదు. కాబట్టి ఎవరూ మా ఇంటికి రావొద్దు" అంటూ కోలీవుడ్ హీరో శింబు ట్వీట్‌ చేశారు. ఎంతోమంది ప్రేమాభిమానాల వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని పేర్కొన్న ఆయన.. తాజాగా ట్విటర్‌ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. మరో నాలుగు రోజుల్లో శింబు.. 38వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు.
 
ఈ నేపథ్యంలో అభిమానులను ఉద్దేశించి శింబు ట్వీట్ చేశారు. 'జీవితంలో నేను ఎన్నో ఇబ్బందులు, ఎత్తుపల్లాలను చూశాను. కానీ మీ ప్రేమాభిమానాలు మాత్రం ప్రతి క్షణం నాతోనే ఉన్నాయి. శారీరకంగా నేను ఫిట్‌గా మారడానికి, వరుస సినిమాలు ఓకే చేయడానికి మీ అభిమానమే కారణం. నేను నటించిన 'ఈశ్వరన్‌' సినిమాపై మీరు చూపించిన ప్రేమకు ఎంతలా కృతజ్ఞతలు తెలిపిన తక్కువే. నేను మిమ్మల్ని అభిమానుల్లా కాదు నా కుటుంబంలా భావిస్తున్నాను. అందుకే పుట్టిన రోజున నేను నగరంలో వుండను కాబట్టి.. ఫ్యాన్స్ ఇంటి వద్దకు రావొద్దు" అని శింబు విజ్ఞప్తి చేశారు.