గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి

కుంకుమను ఇంట్లోనే తయారు చేసుకోవాలంటే..?

Kum Kum
కుంకుమను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. తద్వారా కుంకుమ ధరించడం ద్వారా వచ్చే అలెర్జీని దూరం చేసుకోవచ్చు. ఎలాగంటే? 
 
కావలసిన పదార్థాలు
పసుపుకొమ్మలు - 200 గ్రాములు 
పటిక - 20 గ్రాములు 
ఎలిగారం - 20 గ్రాములు 
నిమ్మకాయలు - ఆరు 
నువ్వుల నూనె - పది గ్రాములు 
 
తయారీ విధానం.. పటికనూ, ఎలిగారంలనూ, కచ్చాపచ్చాగా దంచి నిమ్మరసం బాగా కలపాలి. ఆపై పసుపు కొమ్మలు అందులో వేసి కలిపి ఓ రోజంతా ఉంచాలి. మరుసటిరోజు మర పాత్రలోకి మార్చాలి. పసుపు కొమ్మలకి బాగా పట్టి వుంటాయి. వాటిని నీడ వుండే ప్రదేశంలో వుంచి ఎండబెట్టాలి. ఆ తర్వాత రోటిలో వేసి బాగా మెత్తగా దంచాలి. దంచిన కుంకుమను తెల్లబట్టలో వేసి జల్లించుకోవాలి. 
 
చాలా కొద్దిగా నూనె వేసి కలుపుకుని కుంకుమ భరిణలో పదిలం చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కుంకుమను నుదుట ధరించుకోవాలి. సుగంధం కోసం అత్తరును కూడా చాలా తక్కువ మోతాదులో కలుపుకోవచ్చు.