సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (19:08 IST)

ఐదు భాష‌లు, నలుగురు ద‌ర్శ‌కులు 125 కోట్ల బ‌డ్జెట్‌తో శింబు సినిమా `మానాడు`

Simbu, Maanadu, Raviiteja
చాలా కాలం త‌ర్వాత శింబు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న సినిమా `మానాడు` విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. త‌మిళంలో రూపొందించిన ఈ సినిమాలో న‌లుగు ద‌ర్శ‌కులు న‌టించ‌డం విశేషం. భారతీరాజా-ఎస్.ఏ.చంద్రశేఖర్-ఎస్.జె.సూర్య-కరుణాకరన్ నటిస్తున్న వినూత్న కథాచిత్రం. పొలిటిక‌ల్ నేప‌థ్యంలో సాగుతున్న చిత్ర క‌థాంశ‌మిది. ఇప్ప‌టికే త‌మిళ‌నాడు రాజ‌కీయ పార్టీల హ‌డావుడి అక్క‌డి రాజ‌కీయాల‌ను ప్ర‌తిబింబేంచేలా ఈ చిత్ర‌ముంటుంద‌ని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాకు దాదాపు 125 కోట్ల‌తో నిర్మించిన‌ట్లు యూనిట్ చెబుతోంది. కాగా, ఈ సినిమా టీజ‌ర్‌ను మాస్ హీరో ర‌వితేజ విడుద‌ల చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించింది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో శింబు, కల్యాణి ప్రియదర్శన్ నాయ‌నా నాయిక‌లుగా న‌టిస్తున్నారు.
 
వి హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత 'సురేష్ కామాచి" 125 కోట్ల భారీ బడ్జెట్ తో హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో నిర్మిస్తున్న బహుభాషా చిత్రం "మానాడు" ఫస్ట్ లుక్ మాస్ మహరాజా రవితేజ రిలీజ్ చేయనున్నారు. ఫిబ్రవరి 3, మధ్యాహ్నం 2.34 నిమిషాలకు రవితేజ 'మానాడు'  టీజర్ రిలీజ్ చేయనున్నారు  పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో శింబు ముస్లింగా నటిస్తుండడం గమనార్హం. తమ చిత్రం 'మానాడు' తెలుగు టీజర్ ను తాజాగా 'క్రాక్'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రవితేజ విడుదల చేయనుండడం పట్ల దర్శకనిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు.