శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 డిశెంబరు 2020 (14:11 IST)

శింబుకి సూపర్ గిఫ్ట్ ఇచ్చిన ఆమె..? ఎవరు..?

Mini Cooper
''ఈశ్వరుడు'' అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించనున్న కోలీవుడ్ హీరో శింబు... నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ సుశీంద్రన్ దర్శకత్వంలో ఓ గ్రామీణ నేపథ్యంలో చిత్రం చేయనున్నాడు. ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. అయితే కొన్ని నెలలుగా శింబు పడుతున్న కష్టం, వర్క్‌పై ఆయనకున్న అంకిత భావాన్ని చూసి మురిసిపోయిన శింబు తల్లి బ్రిటీష్ రేసింగ్ కారు మినీ కూపర్‌ను శింబుకు బహుమతిగా ఇచ్చారు. 
 
ఇది శింబు డ్రీమ్ కారని, దీని ధర దాదాపు రూ.50 లక్షలని తెలుస్తోంది. తల్లి ఇచ్చిన గిఫ్ట్‌కు శింబు తెగ హ్యాపీగా ఫీలయ్యాడట. శింబు ఇటీవల ఈశ్వరన్‌' సినిమాకి పని చేసిన 400 మందికి ఒక గ్రాము బంగారు నాణెం బహుమతిగా ఇచ్చారు. అలాగే 200 మంది జూనియర్‌ ఆర్టిస్టులకు బట్టలు పెట్టారు. దీపావళి కానుకగా శింబు ఇచ్చిన ఈ సర్‌ప్రైజ్ యూనిట్ సభ్యులకి షాక్ ఇచ్చింది.
 
అలా శింబు ఈశ్వరన్ సినిమా కోసం అంకిత భావంతో పనిచేశాడట. లాక్‌డౌన్ సమయంలో భారీగా వర్కవుట్స్ చేసి 101 కేజీల నుండి 71 కేజీల వరకు తగ్గాడట. తనలోని మార్పు తనకే షాకిచ్చిందని అంటున్నాడు శింబు.