శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 నవంబరు 2020 (17:21 IST)

త్రిష వైరాగ్యం : జీవితాంతం సింగిల్‌గానే ఉంటుందట...

తెలుగు చిత్ర పరిశ్రమలోని ముదురు హీరోయిన్లలో త్రిష ఒకరు. ఒకపుడు ఇటు తెలుగు, అటు తమిళంలో అగ్ర హీరోయిన్‌గా రాణించింది. ఆ తర్వాత పలువురుతో ప్రేమలోపడింది. ఓ వ్యక్తితో నిశ్చితార్థం కూడా జరిగింది. ఇది మధ్యలోనే వికటించింది. ఆ తర్వాత తమిళ కుర్ర హీరో శింబుతో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ, వీటిపై క్లారిటీ లేదు. ఇపుడు సినిమాలు లేక ఇంటికే ఈ చెన్నై చిన్నది పరిమతమైంది. 
 
ఈ క్రమంలో తన పెళ్లిపై 37 యేళ్ళ త్రిష తాజాగా కామెంట్స్ చేసింది. తన మనసుకు నచ్చిన వ్యక్తి దొరికితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని త్రిష తెలిపింది. తనను పూర్తిగా అర్థం చేసుకునే వ్యక్తి దొరికితే తన వైవాహిక జీవితం ప్రారంభమవుతుందని చెప్పింది. తన మనసుకు నచ్చే వ్యక్తి దొరికేంత వరకు సింగిల్ గానే ఉంటానని స్పష్టం చేసింది. ఒకవేళ అలాంటి వ్యక్తి దొరకకపోతే జీవితాంతం ఒంటరిగానే మిగిలిపోతానని సంచలన వ్యాఖ్యలు చేసింది.