బంధువుల అమ్మాయితో ప్రభుదేవా ప్రేమ ... త్వరలో పెళ్లి?
ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా త్వరలోనే మరో పెళ్లి చేసుకోనున్నారనే ప్రచారం కోలీవుడ్‌లో సాగుతోంది. ఈయన బంధువుల అమ్మాయితో ప్రేమలో ఉన్నట్టు సమాచారం. ఈమెను త్వరలోనే వివాహం చేసుకోనున్నట్టు సమాచారం.
నిజానికి ప్రభుదేవాకు తొలుత రమలత అనే మహిళను వివాహం చేసుకున్నారు. ఈమెకు పిల్లలు కూడా ఉన్నారు. ఆ తర్వాత ఆమెకు విడాకులిచ్చి ప్రముఖ హీరోయిన్ నయనతారతో కొంతకాలం సహజీవనం చేశారు. కొంతకాలం తర్వాత ఆమెతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఆమెతో తెగదెంపులు చేసుకున్నారు.
అప్పటి నుంచి ఆయన ఒంటరిగా జీవిస్తున్నారు. ఈ సింగిల్ బ్యాచిలర్ ప్రభుదేవా తన బంధువుల అమ్మాయితో ప్రేమలో పడ్డారట. ఆమె కూడా ప్రభుదేవాను ఇష్టపడుతోందట.
త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ప్రభుదేవా ఇప్పటివరకు స్పందించలేదు. ప్రభుదేవా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా "రాధే" సినిమాను రూపొందిస్తున్నారు.