మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 మే 2022 (17:05 IST)

జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో కుప్పకూలిన వధువు...

bride
ఓ పెళ్ళి వేడుకలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వధువు తలపై వరుడు జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో వధువు కుప్పకూలిపోయింది. దీంతో ఆందోళన చెందిన ఇరు కుటుంబాల సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ వధువు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూసింది. ఈ విషాదకర ఘటన విశాఖపట్టణం జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విశాఖపట్టణం జిల్లా మధురవాడలో బుధవారం రాత్రి వివాహ వేడుకల జరుగుతుంది. సరిగ్గా జీలకర్ర, బెల్లం పెట్టే సమయంలో వధులు స్పృహ కోల్పోయి కుప్పకూలిపడిపోయింది. 
 
దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ గురువారం ఉదయం కన్నుమూసింది. వివాహ వేడుకలో ఎంతో సంతోషంగా గడపాల్సిన వధూవరుల ఇళ్ళలో తీవ్ర విషాద ఘటన జరిగింది. ఇది ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టించింది.