మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 మే 2022 (13:14 IST)

రైలులో ప్రసవించి.. పసికందును టాయిలెట్‌లో వదిలేసి...

baby
విశాఖపట్టణంలో ఓ మహిళ రైలులో ప్రసవించింది. ఆ బిడ్డను రైలు మరుగుదొడ్డిలో వదిలేసి వెళ్లింది. ఈ బిడ్డను రైల్వే రక్షణ భటులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్టణానికి వచ్చిన బొకారో ఎక్స్‌‌ప్రెస్‌లో ఈ పసికందును గుర్తించారు. 
 
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఆర్‌పీఎఫ్ జీఆర్‌పీ పోలీసులు రైలులోకి వచ్చి పసికందును స్వాధీనం చేసుకుని, విశాఖలోని రైల్వే ఆస్పత్రికి తరలించారు. అయితే, రైలులో ప్రసంవించిన మహిళను గుర్తించే పనిలో రైల్వే పోలీసులు నిమగ్నమయ్యారు.