శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

భవిష్యత్ బెంగతో పెళ్లి కొడుకు ఆత్మహత్య .. ఎక్కడ?

విశాఖపట్టం జిల్లా మల్కాపురంలో మరికొన్ని గంటల్లో పెళ్ళిపీటలెక్కాల్సిన పెళ్ళి కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. భవిష్యత్ బెంగతోనే తాను బలవన్మరణానికి పాల్పడినట్టు సూసైడ్ నోట్‌లో రాశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
విశాఖ నగరం మల్కాపురం ప్రాంతంలోని జై ఆంధ్రా కాలనీకి చెందిన పాటి దినేష్ (25) అనే యువకుడు హెచ్.పి.సి.ఎల్‌లో కాంట్రాక్టు కార్మికుడుగా పనిచేస్తున్నాడు. ఆయనకు పెందుర్తి సమీపంలోని పెదగాడి ప్రాంతానికి చెందిన ఓ యువతితో నిశ్చితార్థమైంది. వీరిద్దరికి పెళ్లి బుధవారం రాత్రి 10.15 గంటలకు జరగాల్సివుంది. ఇందుకోసం మంగళవారం దినేశ్‌ను పెళ్ళి కుమారుడిని చేసి పెళ్లికి వచ్చిన బంధువులంతా సరదాగా గడిపారు. 
 
ఆ తర్వాత వేకువజామున మిద్దెపైకి వెళ్ళిన వరుడు చీరతో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. దినేశ్ రాసినట్టుగా భావిస్తున్న సూసైడ్ నోట్ లభ్యమైంది. ఇందులో తనను ఇంట్లో చిత్ర హింసలు పెడుతున్నారని, కంపెనీలో పనికి వెళితే కాంట్రాక్టర్ అతని సొంత పనులకు ఉపయోగించుకుంటున్నారని, భవిష్యత్ బెంగతోనే తాను ఆత్మహత్య చేసుకున్నట్టు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. దీంతో భాజాభజంత్రీలు మోగాల్సిన ఇంట చావుడప్పులు మోగాయి.