ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధిగా ముకేష్ కుమార్ మీనా
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముఖేశ్ కుమార్ మీనా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకు ఈ పదవిలో సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్ కొనసాగుతూ వచ్చారు. ఈయన స్థానంలో ముఖేశ్ కుమార్ మీనాను నియమిస్తూ భారత ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది.
కాగా, గత 1998 బ్యాచ్‌కు చెందిన ముఖేశ్ కుమార్... ఉమ్మడి రాష్ట్ర కేడర్‌ను ఎంచుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన ఏపీ కేడర్‌కు ఆప్షన్ ఇవ్వగా, ఆ మేరకు ఆయన్ను ఏపీ కేడర్ అధికారిగా పరిగణించి ఈసీగా నియమించారు.
ఇప్పటివరకు ఆయన రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. కాగా, ఈసీ ఆదేశాలతో ఆయన త్వరలోనే రాష్ట్ర ఎన్నికల కమిషనరుగా బాధ్యతలు స్వీకరించనున్నారు.