Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల
Niharika Konidala
నాగబాబు కుమార్తెగా అందరికీ పరిచయమైన నీహారిక ఇంతకుముందు హీరోయిన్ గా కొద్ది సినిమాలలో నటించింది. ఆ తర్వాత పెండ్లి చేసుకుని వ్యక్తిగత కారణాలతో విడిపోయింది. అప్పటినుంచి బాధ్యతగా చిత్ర నిర్మాణ రంగంలో ప్రవేశించి సక్సెస్ సినిమాలు తీస్తుంది. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా నిహారికాకు మంచి క్రేజ్ వచ్చింది. నిహారిక చేసిన షార్ట్ ఫిలిమ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
మొదట్లో నాగశౌర్య హీరోగా ఒక మనసు అనే సినిమా నటించినా పెద్దగా లాభించలేదు. ఆ తర్వాత వరుసగా హీరోయిన్ గా సినిమాలు చేసినా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ప్రస్తుతం నిర్మాణ రంగంలో బిజీగా ఉన్న నిహారిక పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెం.2 ఓ సినిమా చేస్తుంది. ఈ సినిమాలో హీరోగా సంగీత శోభన్ నటిస్తున్నాడు. ఇటీవలే ప్రారంభం అయ్యింది.

