సోమవారం, 4 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 ఆగస్టు 2025 (20:30 IST)

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

tollywood shootings
తెలుగుచిత్రపరిశ్రమలో పని చేసే సినీ కార్మికులకు 30 శాతం వేతనాలు పెంచాలని నిర్ణయించినట్టు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సెక్రటరీ అమ్మిరాజు కానుమిల్లి వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. 
 
ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ 24 కార్మిక సంఘాల నాయకులకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆదివారం జరిగిన ఫెడరేషన్ సర్వసభ్య సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు. వేతనాలు పెంపు విషయంలో కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్‌లుగా సయ్యద్ హ్యూమయున్‌ని, వీరశంకర్‌ని నియమించడం జరిగిందన్నారు.
 
సోమవారం నుంచి 30 శాతం వేతనాలు పెంచి ఇవ్వాలని నిర్ణయించాలని సూచించారు. సోమవారం నుండి 30 శాతం వేతనాలు ఇస్తామని, ప్రొడ్యూసర్ నుండి కన్ఫర్మేషన్ లెటర్ ఇచ్చిన వారికి మాత్రమే, సంబంధిత లెటర్ ఫెడరేషన్ ద్వారా యూనియన్‌లకు తెలియజేసిన తర్వాత మాత్రమే విధులకు వెళ్లాలని, నిర్ణయించడమైనది.
 
అప్పటివరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్‌కు సంబందించిన సభ్యులు ఎవరు కూడా సినిమాకు గాని, వెబ్ సిరీస్‌ల షూటింగ్‌లకు గాని, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నుండి అనుమతి లేనిది ఎటువంటి విధులకు యూనియన్ సభ్యులు హాజరు కాకూడదని నిర్ణయించడమైనదన్నారు. ఈ రూల్స్ తెలుగు సినిమా ఎక్కడ జరిగినా వర్తించునని తెలిపారు. ఇది బాషా చిత్రాలకు కూడా వర్తించనని తెలిపారు.