గురువారం, 31 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 30 జులై 2025 (23:26 IST)

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

anasuya
సినిమాల్లో బోల్డ్‌గా నటిస్తే అగౌరవంగా ప్రవర్తించినట్టా అని సినీ నటి, వ్యాఖ్యాత అనసూయ ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు ఆమె ఓ పెద్ద పోస్ట్ పెట్టింది. తన డ్రెస్సింగ్ స్టైల్‌ను కొందరు విమర్శిస్తున్నారంటూ వాపోయింది. 
 
"నన్నెవరూ కామెంట్ చేసినా ప్రస్తుతం సైలెంట్‌గా ఉంటున్నా... కానీ నా జీవిత విధానాన్నే విమర్శిస్తుంటే మాట్లడక తప్పడం లేదు. కొన్ని సోషల్ మీడియా చానెల్స్ నన్ను లక్ష్యంగా చేసుకున్నాయి. ఆయా వీడియోల్లో మహిళలో నన్ను విమర్శించారు. వారెవరో నాకు తెలియదు. నేను వారికి తెలియదు. 
 
అయినా నా వ్యక్తిగతం గురించి మాట్లాడారు. అవును.. నేను ఓ స్త్రీని. భార్యని, ఇద్దరు పిల్లలకు తల్లిని. నా స్టైల్‌ను ప్రతిబింభించే దుస్తులు ధరించడాన్ని నేను ఆస్వాదిస్తా. నేను ఓ తల్లిగా ప్రవర్తంచడం లేదని కొందరు అంటున్నారు. తల్లి కావడం అంటే మనల్ని మనం వదులుకోవడమా? అని ప్రశ్నించారు. 
 
నా భర్త, పిల్లలు, నన్ను ప్రేమిస్తున్నారు. వారెపుడూ నన్ను జడ్జ్ చేయలేదు. నాకు సపోర్ట్ చేస్తారు. అది చాలు. విశ్వాసం, దయ, గౌరవం ఉన్న మహిళను చూస్తూ నా పిల్లలు పెరుగుతున్నారు. బోల్డ్‌గా ఉండటమంటే అగౌరవంగా ప్రవర్తిస్తున్నట్టు కాదు. నేను ఇష్టపడే విధంగా దుస్తులు ధరిస్తున్నారంటే నేను నా విలువలను కోల్పోయానని కాదు. అని తనను విమర్శించిన వారికి ఘాటుగా సమాధానం చెప్పింది.