నేడు తెలంగాణాలో ఓ మోస్తరు వర్షాలు
కోస్తాంధ్రపై 2.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడివుందని, అలాగే, బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్, తెలంగాణా మీదుగా తమిళనాడు వరకు 1500 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడివుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ కారణంగా తెలంగాణాలో నేడు అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
దీని ప్రభావం కారణంగా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. పాలమూరులో అత్యధికంగా 2.2 సెంటీమీటర్ల వర్షం పాతం నమోంది. ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌లో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఇదిలావుంటే, బంగాళాఖాతంలో అండమాన దీవులకు సమీపంలో నేడు నైరుతి రుతపవనాల కదలికలు మెదలవుతాయని, ఈ నెలాఖరు నాటికి కేరళ తీరాన్ని తాకుతాయని వావరణ శాఖ తెలిపింది.