శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 15 మే 2022 (11:45 IST)

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మళ్లీ భేటీకానున్న పీకే

prashanth kishore
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జాతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోమారు భేటీకానున్నారు. ఇప్పటికే పలుమార్లు సమావేశమైన పీకే... ఈ నెల 18వ తేదీన మరోమారు తెరాస అధినేతతో సమావేశంకానున్నట్టు తెలుస్తుంది. 
 
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలపై సీఎం కేసీఆర్‌కు ఆయన ఓ నివేదిక ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. తెరాస పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై కేసీఆర్‌కు సమగ్ర సమాచారంతో నివేదిక సమర్పించనున్నట్టు తెలుస్తుంది. 
 
వీరిద్దరి భేటీ సీఎం కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతి భవన్లో జరుగనుంది. ఈ భేటీలోనే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై కూడా ఆయన చర్చించనున్నట్టు తెలుస్తోంది.