మంగళవారం, 5 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 మే 2022 (13:34 IST)

Revanth Vs Kavitha:ట్విట్టర్‌‌లో వార్

Kalvakuntla kavita
కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ తెలంగాణ పర్యటనకు ముందు ట్విట్టర్‌‌లో వార్ జరుగుతోంది. సీఎం కేసీఆర్‌ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 
 
రాహుల్‌ గాంధీ ఎన్నిసార్లు పార్లమెంట్‌‌లో తెలంగాణ సమస్యలను ప్రస్తావించారో చెప్పాలని కవిత అన్నారు. తెలంగాణ రాష్ట్ర హక్కులకోసం, దేశవ్యాప్తంగా ఒకే వరి కొనుగోలు విధానంపై టిఆర్ఎస్ పార్టీ పోరాడుతుంటే రాహుల్‌ ఎక్కడ ఉన్నారన్నారు. 
 
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు విద్యాసంస్థలు ఇవ్వకుండా మొండిచేయి చూపిస్తున్నప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలు తెలంగాణ ముఖచిత్రాన్నిఎలా మార్చాయో కాంగ్రెస్‌ నాయకులను అడిగి తెలుసుకోవాలని చెప్పారు.