రాహుల్ జీ ఆర్ యూ రెడీ ఫర్ వైట్ ఛాలెంజ్?.. తెలంగాణలో బ్యానర్లు
Rahul Gandhi
ఇక బ్యానర్లలో ఇటీవల నేపాల్ రాజధాని ఖాఠ్మండ్‌లో ఓ మహిళతో పబ్‌లో కనిపించిన దృశ్యాలను పొందుపరిచారు. దమ్ముంటే డ్రగ్స్ టెస్టుకు సిద్ధంగా ఉండాలని రాహుల్‌కు సవాల్ విసిరారు. ప్రస్తుతం ఈ బ్యానర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ కేసులు బయటకు వచ్చిన సమయంలో టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి 2021 సెప్టెంబర్ 18న కేటీఆర్‌కు వైట్ ఛాలెంజ్ విసిరాడు. ఈ విషయమై గతేడాది సెప్టెంబర్ 20వ తేదీన కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే.
తర్వాతి కథనం