శుక్రవారం, 28 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

కోర్టు ధిక్కరణ కేసులో మరో ఐఏఎస్‌కు జైలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారులు వరుసగా జైలుశిక్షలకు గురవుతున్నారు. ముఖ్యంగా కోర్టు ధిక్కరణ కేసుల్లో వారు కోర్టు ఆగ్రహానికి గురవుతున్నారు. ఇలాంటి ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు జైలుశిక్ష విధిస్తుంది. 
 
తాజాగా గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కమిషనరుగా పని చేసిన ఐఏఎస్ అధికారి హరినారాయన్‌కు మూడు నెలల జైలుశిక్ష విధిస్తూ హైకోర్టు తీర్పునిచ్చిది. విశాఖ నగరంలోని వీధి వ్యాపారులకు సంబంధించి కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. దీంతో కోర్టు ధిక్కరణ కింద ఆయన జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. 
 
అయితే, ఈ శిక్ష అమలుకు ఆరు వారాలు వాయిదా వేస్తూ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తీర్పును వెలువరించింది. నిందితుడు విస్తృత ధర్మాసనంలో తీర్పును సవాల్ చేసుకునేందుకు ఈ వెసులుబాటును ఇస్తున్నట్టు తెలిపింది. 
 
విస్తృత ధర్మానంలో కూడా ఈ తీర్పుపై స్టే ఇవ్వకపోతే జూన్ 16వ తేదీన హరినారాయణ స్వయంగా హైకోర్టు రిజిస్ట్రార్ ముందు లొంగిపోవాలని న్యాయమూర్తి దేవానంద్ ఆదేశించారు.