శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 మే 2022 (12:16 IST)

కడపలో టీడీపీ అధినేత చంద్రబాబు.. మహానాడు కోసం పక్కా ప్రణాళిక

nara chandra babu pc
టీడీపీ అధినేత చంద్రబాబు కడపలో పర్యటించనున్నారు. మూడు రోజులపాటు రాయలసీమ జిల్లాల్లో బాబు పర్యటిస్తారు. టీడీపీ చేపట్టిన 'బాదుడే బాదుడు' కార్యక్రమంలో నేడు కడప జిల్లాలోని కమలాపురంలో చంద్రబాబు పర్యటించనున్నారు. 
 
ఈ పర్యటనలో జిల్లా స్థాయి నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాల నేతలు, కార్యకర్తలు పాల్గొనున్నారు. సాయంత్రం కమలాపురంలో 'బాదుడే బాదుడు' కార్యక్రమంలో పాల్గొనున్న చంద్రబాబు అనంతరం బహిరంగసభలో ప్రసంగించనున్నారు. 
 
ఈ నెల 19న నంద్యాల జిల్లాలోని డోన్‌లో చంద్రబాబు పర్యటన వుంటుంది. అలాగే 20న సత్యసాయి జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటిస్తారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయా జిల్లాల్లో ఉదయం కార్యకర్తలు, ముఖ్య నేతల సమావేశంలో పాల్గొంటారు. మహానాడు లోపు రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను చుట్టేలా చంద్రబాబు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.  
 
తెలుగుదేశం పార్టీ మహానాడు తేదీలు ఖరారు చేశారు. ఈ నెల 27, 28 తేదీల్లో ఒంగోలులో టీడీపీ మహానాడు నిర్వహించనున్నారు. మహానాడు నిర్వహణకు 80 ఎకరాల స్థలాన్ని టీడీపీ శ్రేణులు ఎంపిక చేశాయి.