మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 మే 2022 (20:29 IST)

రుషికొండ వద్ద ఉద్రిక్తత.. బాబును వెళ్లనీయకుండా అడ్డుకున్నారు

టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడంతో రుషికొండ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విశాఖ రుషికొండ పరిశీలనకు వెళ్తున్న చంద్రబాబును పోలీసులు అడ్డగించారు. దీంతో ఎండాడ జంక్షన్‌లో టెన్షన్‌ తలెత్తింది.
 
రుషికొండకు వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పి.. అడ్డుకోవడంతో హైవేపైనే చంద్రబాబు కాన్వాయ్‌ నిలిచిపోయింది. చంద్రబాబును అడ్డుకోవడంపై తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 
 
మరోవైపు.. అప్పటికే రుషికొండ వద్దకు వెళ్లిన టీడీపీ శ్రేణుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.