ఏలూరు ఘటనపై ప్రముఖుల స్పందన: మృతుల సంఖ్య..?
ఏలూరు పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుంది. పరిస్థితి విషమంగా మారిన వారిని విజయవాడ జిజిహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో విధుల్లో మొత్తం 17 మంది సిబ్బంది ఉన్నట్లుగా సమాచారం. ప్రస్తుతం ఆస్పత్రికి తరలించిన వారిలో ఐదుగురు పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.
ముసునూరు మండలంలో పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో చోటుచేసుకున్న ఈ ఘోర అగ్ని ప్రమాదం పట్ల ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మరణించిన వారి కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డి వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయల పరిహారం ఇస్తున్నట్లు ప్రకటించారు.
పోరస్ కెమికల్ ఫ్యాక్టరీ అగ్నిప్రమాద ఘటనపై తెలుగుదేశం పార్టీ స్పందించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
ఏలూరు జిల్లా, ముసునూరు మండలం, అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ఘోర ప్రమాదం దురదృష్టకరం అని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
పోలీస్ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాద ఘటనపై టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాద ఘటన కలచివేసిందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.