ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 ఏప్రియల్ 2022 (22:23 IST)

జగన్‌ను సీఎం పదవి నుంచి పీకడానికి ప్రజలు సిద్ధంగా వున్నారు..?

chandrababu
దేవుడి దయ, ప్రజల అభిమానం ఉన్నంతవరకు తన వెంట్రుక కూడా ఎవరూ పీకలేరని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. 
 
రాష్ట్రంలో కరెంట్ పీకుతున్న జగన్‌ను సీఎం పదవి నుంచి పీకడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు అన్నారు. టీడీపీ పిలుపునిచ్చిన బాదుడే బాదుడు కార్యక్రమంపై నిర్వహించిన ఆన్‌లైన్‌ సమీక్షలో ఆయన మాట్లాడారు.
 
ఏపీలో విద్యుత్ కోతలు, పెరిగిన కరెంట్ ఛార్జీలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో వున్నారని చంద్రబాబు గుర్తు చేశారు. పరిశ్రమలకు విద్యుత్‌ కోతలతో కార్మికుల ఉపాధి పోతోంది. పంటలకు నీరందక రైతులుసంక్షోభంలోకి వెళ్లిపోతున్నారు. ప్రభుత్వ చేతకానితనం వల్లే రాష్ట్రానికి ఈ గతి పట్టిందని ఫైర్ అవుతున్నారు. 
 
'పార్టీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి కొవ్వొత్తులు, అగ్గిపెట్టె, బాదుడే బాదుడుపై కరపత్రం పంపిణీ చేస్తున్నారు. విద్యుత్ సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయాలి' అని చంద్రబాబు పార్టీ శ్రేణులకు ఆదేశించారు.