గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (14:21 IST)

తెలంగాణ మంత్రి కేటీఆర్ దంపతులతో మేఘాలయ సీఎం భేటీ

ktr - sangma
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ దంపతులతో మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా భేటీ అయ్యారు. శుక్రవారం హైదరాబాద్ నగరంలోని ప్రగతి భవన్‌లో కేటీఆర్, శైలిమ దంపతులను సంగ్మా దంపతులు కలిశారు. ఈ సందర్భంగా సంగ్మా దంపతులను కేటీఆర్ దంపతులు శాలువాతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.
 
ఈ సందర్భంగా రెండు రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై కేటీఆర్, సంగ్మాలు చర్చించుకున్నారు. అయితే, ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. సంగ్మాతో భేటీ కావడం సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. అలాగే సంగ్మా కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు.