1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 17 జులై 2021 (15:40 IST)

ప్రధాని మోడీతో శరద్ పవార్ భేటీ... వ్యూహం ఏంటి?

ప్రధాని నరేంద్ర మోడీతో మరాఠా యోధుడు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ శనివారం సమావేశమయ్యారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీ దాదాపు 50 నిమిషాల పాటు జరిగినట్టు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ భేటీ దేశ రాజకీయాల్లో ఊహించని పరిణామంగా రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
భారత రాష్ట్రపతి రేసులో శరద్ పవార్ ఉండబోతున్నారంటూ గత కొంతకాలంగా జోరుగా ప్రచారం సాగుతోంద. ఆయనకు దేశవ్యాప్తంగా మద్దతును కూడగట్టేందుకు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రయత్నిస్తున్నారనే వార్తలు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే, రాష్ట్రపతి పదవికి తాను పోటీ చేయబోనని పవార్ ఇప్పటికే స్పష్టం చేశారు.
 
ఈ నేపథ్యంలో ప్రధాని మోడీతో పవార్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్ పార్టీలతో కలిసి ఎన్సీపీ అధికారాన్ని పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంపై ఈ భేటీ ఏ మేరకు ప్రభావాన్ని చూపబోతోందనే విషయం కూడా ఆసక్తికరంగా మారింది.