ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 జులై 2021 (12:26 IST)

సొంత నియోజకవర్గంలో వారణాసి లోక్‌సభ సభ్యుడు ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ తన సొంత నియోజకవర్గ పర్యటనకు గురువారం వెళ్లారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో తన సొంత నియోజకవర్గం నుంచి తన పర్యటనకు శ్రీకారం చుట్టారు. 
 
తన సొంత నియోజకవర్గమైన వారణాసికి ఈ ఉదయం చేరుకున్న ప్రధానికి గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. ప్రధాని మోడీ తన పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. 
 
ఇందులోభాగంగా రూ.744 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అలాగే, రూ.839 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. జపాన్ సహకారంతో నిర్మించిన ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ ‘రుద్రాక్ష్’ను మోడీ ప్రారంభిరు.