శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 జులై 2021 (09:50 IST)

వారణాసికి వెళ్లనున్న ప్రధాని నరేంద్ర మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ గురువారం తన సొంత నియోజకవర్గమైన వారణాసికి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో వివిధ రకాలైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టునున్నారు. ఈ ప్రాజెక్టుల విలువ రూ.744 కోట్లు. వీటితోపాటు రూ.839 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. 
 
ముఖ్యంగా, బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్‌యూ)లోని ఎంసీహెచ్‌లో 100 పడకల ఆసుపత్రితో పాటు మల్టీ పార్కింగ్‌, గంగా నదిలో పర్యాటకాభివృద్ధికి ఉద్దేశించిన రోరో బోట్లను ప్రధాని ప్రారంభించనున్నారు. 
 
అలాగే, వారణాసి - ఘాజీపూర్ జాతీయ రహదారిపై నిర్మించిన మూడు లైన్ల ఫ్లైఓవర్‌ వంతెనను ప్రారంభిస్తారు. అలాగే, మధ్యాహ్నం 12.15 గంటలకు జపాన్‌ సహకారంతో నిర్మించిన ఇంటర్నేషనల్‌ కో-ఆపరేషన్‌ అండ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ 'రుద్రాక్ష్‌'ను ప్రారంభించనున్నారు. 
 
మధ్యాహ్నం 2గంటలకు బీహెచ్‌యూలోని మాతా శిశు ఆరోగ్య విభాగాన్ని ప్రధాని తనిఖీ చేస్తారు. ఆ తర్వాత వైద్యులు, ఉన్నతాధికారులతో కరోనా సన్నద్ధతపై సమీక్షిస్తారు.