గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 జులై 2021 (17:31 IST)

19 నుంచి పార్లమెట్ శీతాకాల సమావేశాలు

ఈ నెల 19వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలు మొత్తం 19 రోజుల పాటు జరుగనున్నాయి. ఆగస్టు 13వ తేదీతో ముగుస్తాయి. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. రాజ్యసభ, లోక్‌సభల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 వరకు సమావేశాలు కొనసాగుతాయని చెప్పారు. 
 
కరోనా నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సమావేశాలను నిర్వహిస్తామన్నారు. ఎంపీలందరూ ఆర్టీపీసీఆర్ టెస్ట్ తప్పకుండా చేయించుకోవాలని సూచించారు. కోవిడ్ టీకా తీసుకోని వారు వ్యాక్సిన్ తీసుకోవాలని తెలిపారు. 
 
కాగా, ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని పెట్రోల్ ధరలపై నిలదీసేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా, దేశ వ్యాప్తంగా ప ెట్రోల్, డీజల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెల్సిందే. ఈ ధరలపై కేంద్రం కిమ్మనకుండా ఉంది.