సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 జులై 2021 (21:52 IST)

తెరుచుకోనున్న శబరిమల.. ఆ సర్టిఫికేట్లు తప్పనిసరి

శబరిమల ఆలయం తెరుచుకోనుంది. మాస పూజల కోసం ఈనెల 17 నుంచి 21 వరకూ ఆలయాన్ని భక్తుల సందర్శనార్ధం తెరుస్తున్నట్టు దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది. భక్తులు తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు కానీ, 48 గంటల్లోపు జారీ చేసిన ఆర్‌టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్టు కానీ తెచ్చుకోవాలని, అప్పుడే వారిని ఆలయ ప్రవేశం కల్పిస్తామని తెలిపింది. 
 
ఆన్‌లైన్ బుకింగ్ పద్ధతిలో గరిష్టంగా 5,000 మంది భక్తులను మాత్రమే అనుమతిస్తామని ప్రకటించింది. కేరళలో కోవిడ్ -19 తగ్గుముఖం పట్టలేదు. రాష్ట్రంలో ఇప్పటికీ రోజువారీ 15,000 కేసులు నమోదవుతున్నాయి. కేరళలో శనివారం 14,087 మందికి వైరస్ సోకినట్లు గుర్తించగా, 109 మంది ఈ వ్యాధి బారిన పడ్డారని రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.