1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 జనవరి 2022 (10:57 IST)

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం బ్యాడ్ న్యూస్..శకటాలకు ఈ ఏడాది స్థానం దక్కలేదు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర సర్కారు బ్యాడ్ న్యూస్ చెప్పింది. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల 26న ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో జరిగే వేడుకల్లో తెలుగు రాష్ట్రాల శకటాలకు ఈ ఏడాది స్థానం దక్కలేదు. 
 
అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మేఘాలయా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన శకటాలే రిపబ్లిక్ డే వేడుకల్లో కవాతు చేస్తాయని కేంద్ర రక్షణశాఖ తెలిపింది. ఈసారి గణతంత్ర వేడుకలకు మొత్తం 12 రాష్ట్రాలు, 9 శాఖలకు చెందిన శకటాలే రిపబ్లిక్ డే కవాతులో పాలుపంచుకోనున్నాయి. 
 
ఈ ఏడాది రిపబ్లిక్ వేడుకల్లో కవాతు ప్రారంభమయ్యే సమయాన్ని ఉదయం 10 గంటలకు బదులు 10:30 గంటలకు మార్చినట్లు అధికారులు వెల్లడించారు. మంచు కమ్మేసే అవకాశం ఉన్నందున ఈ మార్పు చేసినట్లు వివరించారు. ఈ ఏడాది ఫ్లైపాస్ట్‌లో విమానాలు, హెలికాప్టర్లు 15 విభిన్న భంగిమల్లో ఎగిరి కనువిందు చేయనున్నాయి.