మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 జనవరి 2022 (10:30 IST)

కారుణ్య ఉద్యోగ నియామకాలకు పచ్చజెండా ఊపిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య ఉద్యోగ నియామకాలకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 
 
అయితే, ఈ కారుణ్య నియామకాల వర్తింపు, ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్రంట్ లైన్ వర్కర్ల కుటుంబ సభ్యులకే ఉంటుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. కరోనా వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి ఈ యేడాది జూన్ 30వ తేదీలోపు ఉద్యోగం కల్పించేందుకు సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఈ ఉత్తర్వులను జారీచేశారు. 
 
అయితే, ఈ కారుణ్య నియామకాల కింద మృతి చెందిన ఉద్యోగి నిర్వహించిన పోస్టుకు సమానమైన లేదా అంతకంటే తక్కువగా ఉన్న ఉద్యోగ అవకాశాన్ని ప్రభుత్వం కల్పించనుంది. నిజానికి ఈ కారుణ్య మరణాలు గత యేడాది నవంబరు నాటికి పూర్తి చేయాలని భావించారు. కానీ,  దరఖాస్తులు అనేకం ఉండటంతో ఈ ఉద్యోగాల నియామకంలో జాప్యం జరిగింది.