మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 జనవరి 2022 (17:56 IST)

కరోనా కేసులు పెరుగుతుంటే స్కూల్స్ కొనసాగింపా? పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అయినప్పటికీ పాఠశాలలను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని చాలా మంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇపుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 
 
రాష్ట్రంలో మంగళవారం నుంచి రాత్రిపూట కర్ఫ్యూతో పాటు ఇతరాత్రా ఆంక్షలు అమలు చేస్తూనే మరోవైపు బడులు కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడం భావ్యం కాదన్నారు. కోవిడ్ తీవ్ర తగ్గేంత వరకు ప్రత్యక్ష బోధనా తరగతులను వాయిదావేయాలని ఆయన కోరారు. 
 
ముఖ్యంగా, 15 నుంచి 18 యేళ్లలోపు చిన్నారులకు వ్యాక్సినేషన్ ఇంకా పూర్తికాలేదని, వారిలో ఇమ్యూనిటీ తక్కువగా ఉండటం వంటి అంశాలను పరిగణనలోని తీసుకుని నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నట్టు చెప్పారు. అలాగే, కరోనా మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో మద్యం దుకాణాలను మరో గంట పాటు తెరిచివుంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనాలోచిత నిర్ణయంగా ఆయన అభివర్ణించారు.