గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (16:18 IST)

ఇంగ్లీష్‌లో అదరగొట్టేసింది.. ఫిదా అయిన సీఎం జగన్ (వీడియో)

Nandyal
Nandyal
నంద్యాలలో వసతి దీవెన కార్యక్రమాన్ని ఏపీ సీఎం జగన్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన జరిగిన బహిరంగ సభలో ఓ యువతి  ఆంగ్లంలో మాట్లాడి అదరగొట్టింది. ఆమె మాటలకు జగన్ ఫిదా అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
తాను నంద్యాలకు చెందిన అమ్మాయినని.. తాను బీటెక్ కంప్యూటర్ చేస్తున్నానని ఆమె స్పీచ్ ఆరంభమైంది. ఈ స్పీచ్‌లో జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలతో ప్రజలకు కలిగే సంక్షేమాలపై మాట్లాడింది. 
 
నవరత్న స్కీమ్, జగన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ఆరోగ్య శ్రీ, దిశ యాప్‌లతో కలిగే సౌకర్యాలపై ప్రశంసలు గుప్పించింది. ఆమె మాటలు విన్న ఏపీ సీఎం జగన్ ఆమెను దీవించారు. ఆమెతో కలిసి ఫోటో దిగారు. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.