గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (10:56 IST)

నేడు జగనన్నతోడు నిధులు విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిరు వ్యాపారులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. జగనన్న తోడు మూడో విడత పథకం కింద లబ్దిదారులకు సోమవారం సొమ్ము విడుదల చేయనున్నారు. 
 
జగనన్న తోడు పథకం మూడో విడత సొమ్ము ఇప్పటికే విడుదల కావాల్సివున్నప్పటికీ ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మృతితో ఈ నిధుల విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేశారు. 
 
ఈ నేపథ్యంలో సోమవారం ఈ పథకం కింద 5.10 లక్షల మంది లబ్దిదారులకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేయనున్నారు. ఈ పథకం కింద తొలి విడతలో 5.10 లక్షల మంది, రెండో విడతలో 3.70 లక్షల మందికి రుణాలు అందజేస్తారు. మూడో విడతతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా 14.16 లక్షల మందికి ఈ పథకం కింద లబ్ది చేకూరనుంది.