శుక్రవారం, 14 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (16:11 IST)

లతా మంగేష్కర్ మృతి : బీజేపీ మేనిఫెస్టో విడుదల వాయిదా

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టో విడుదలను తాత్కాలికంగా వాయిదా వేసింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మృతితో ఆమెకు గౌరవ సూచకంగా ఈ నిర్ణయం తీసుకుంది. 
 
ఈ ఎన్నికల మేనిఫెస్టో కోసం కేంద్ర హోం మంత్రి అమిత్, సీఎం యోగి, డిప్యూటీ గవర్నర్ కేశవ ప్రసాద్ మౌర్యతో పాటు పలువురు బీజేపీ నేతలు లక్నోకు చేరుకున్నారు. ఈ సమయంలోనే లతా మంగేష్కర్ మరణవార్త వారికి తెలిసింది. 
 
దీంతో మేనిఫెస్టో విడుదల కార్యక్రమాన్ని రద్దు చేసింది. ఆమెకు గౌరవ సూచకంగా తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత రెండు నిమిషాల పాటు అందరూ మౌనం పాటించారు. అదేసమయంలో మేనిఫెస్టో విడుదల తేదీని త్వరలోనే వెల్లడిస్తామని వారు తెలిపారు. 
 
"గాన కోకిల లతా మంగేష్కర్ మృతి చెందారు. దీంతో తాము పార్టీ మేనిఫెస్టో విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నాం. కొన్ని రోజుల్లోనే విడుదల తేదీని ప్రకటిస్తాం" అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్ వెల్లడించారు.