బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 ఫిబ్రవరి 2022 (15:25 IST)

బీజేపీ తీరుపై మండిపడిన వైకాపా నేతలు

భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలపై ఏపీలోని అధికార వైకాపా పార్టీకి చెందిన నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలో ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉన్నారనీ, కానీ బీజేపీ నేతలు మాత్రం వారి మధ్య చిచ్చుపెట్టి కుల మతాల కుంపటిని రాజేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
దేశ ప్రజల మధ్య ఉన్న ఐక్యతను దెబ్బతీయాలనుకోవడం ఘోర తప్పిదమన్నారు. మత శక్తులు, విచ్ఛిన్నకర శక్తుల ప్రయత్నాలను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నారని, ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు వైకాపా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. 
 
మరో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, మతం పేరుతో భారతీయ జనతా పార్టీ సిగ్గులేని రాజకీయాలు చేస్తుందని ఆయన ఆరోపించారు. జిన్నా టవర్‌ అంశాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.