ఆదివారం, 13 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 ఫిబ్రవరి 2022 (14:21 IST)

ఎన్టీఆర్ గార్డెన్స్‌లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం: కేటీఆర్

హైదరాబాద్‌లో, ఒకవైపు అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన టూబీహెచ్‌కే హౌసింగ్ సైట్‌లతో పాటు కొత్త సెక్రటేరియట్‌ను నిర్మిస్తున్నారు. అంతేకాకుండా 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం త్వరలో రానుంది. ఈ మేరకు ఎన్టీఆర్ గార్డెన్స్‌లో త్వరలో 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్ అన్నారు. 
 
ఖైరతాబాద్‌లోని ఇందిరానగర్‌ డిగ్నిటీ హౌసింగ్‌ కాలనీని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఖైరతాబాద్‌ వార్డులో హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ల్యాండ్‌ పార్శిల్‌లో ఫంక్షన్‌ హాల్‌ నిర్మించనున్నట్లు ప్రకటించారు. కేటీఆర్ ప్రారంభించిన ఇందిరా నగర్ డిగ్నిటీ హౌసింగ్ కాలనీ నాలుగు బ్లాకుల్లో 210 నివాస గృహాలను కలిగి ఉంది.