శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (12:34 IST)

లతా మంగేష్కర్ అస్తమయం : రెండు రోజులపాటు సంతాప దినాలు

భారత సినీ దిగ్గజ గాయని లతా మంగేష్కర్ అస్తమించారు. ఆమె ఆదివారం ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆస్పత్రిలో కన్నుమూశారు. అయితే, ఆమె మృతి పట్ల ప్రధాని నరేంద్రమోడీ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. అంతేకాకుండా ఆమె జ్ఞాపకార్థం ప్రభుత్వం రెండు రోజుల జాతీయ సంతాప దినాలు ప్రకటించింది. 
 
నైటింగేల్ ఆఫ్ ఇండియా లతా మంగేష్కర్ 92 ఏళ్ల వయసులో ముంబైలోని క్యాండీ బ్రీచ్ హాస్పిటల్‌లో కన్నుమూశారు. లతా మంగేష్కర్ నవల కరోనా వైరస్ సోకడంతో ఆమెను బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లోని ఐసియులో చేరిన సంగతి తెలిసిందే. అక్కడ చికిత్స పొందే సమయంలో తిరిగి న్యుమోనియా బారినపడ్డారు. దీంతో ఆమె తిరిగి కోలుకోలేక అస్తమించారు. 
 
ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీ నుంచి 7వ తేదీ వరకు సంతాప దినాలను ప్రకటించారు. ఆమెకు గౌరవ సూచకంగా ఈ రెండు రోజుల పాటు జాతీయ పతాకాన్ని ప్రభుత్వ కార్యాలయాలపై అవనతం (జాతీయ జెండాను సగం ఎత్తులోనే పతాకం ఎగురవేసి ఉంచడం) చేస్తారు అని ప్రభుత్వం తెలిపింది. 
 
ఇదిలావుంటే, లతా మంగేష్కర్ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు వరకు ప్రభుకుంజ్‌లోని ఆమె నివాసంలో ఉంచుతారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో ముంబైలోని శివాజీ పార్కులో అంత్యక్రియలు నిర్వహిస్తారు.