1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (11:08 IST)

నేపథ్య గాయకుల రాణి లతా దీదీకి ఎవరికీ అందని రికార్డులు సొంతం

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో 1929 సెప్టెంబరు 28వ తేదీన జన్మించిన నైటింగేల్ ఆఫ్ ఇండియా లతా మంగేష్కర్ ఇకలేరు. 92 యేళ్ల లతా దీదీ ఆదివారం ఉదయం ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో కన్నుమూశారు. అయితే, ఆమె ఒక గాయనిగా భారత సంగీతానికి 70 యేళ్లపాటు సేవ చేశారు. గాయనిగా ఎవరికీ అందని రికార్డులను సొంతం చేసుకున్నారు. ఆమె గానం చేసిన పాటలను దేశ ప్రజలు ఎన్నటికీ మరిచిపోలేరు. తన పాటలతో దేశ చరిత్రలో లతా మంగేష్కర్ స్థిరస్థాయిగా నిలిచిపోయారు. 
 
లతా దీదీ తల్లిదండ్రులు దీనానాథ్ మందేష్కర్, శుద్ధమతిలకు తొలి సంతానం. భారత గానకోకిల అనే బిరుదును సొంతం చేసుకున్న ఆమె తెలుగులో అనేక పాటలను ఆలపించారు. 1955లో అక్కినేని నాగేశ్వర రావు సినిమా "సంతానం"లో 'నిదుర పోరా తమ్ముడా' అనే పాటను తొలిసారి ఆలపించారు. 1965లో ఎన్టీఆర్ సినిమా "దొరికితే దొంగలు"లో 'శ్రీ వెంకటేశా' అనే పాటను 1988లో నాగార్జున "అఖరిపోరాటం" సినిమాలో 'తెల్లచీరకు తకదిమి' పాటను ఆలపించారు. 
 
ఈమె 70 యేళ్ల పాటు భారతీయ సినీ సంగీతానికి సేవలు అందించారు. 1948 నుంచి 1978 వరకు దాదాపు 30 వేలకు పైగా పాటలు పాడి, అన్ని పాటలు పాడిన ఏకైక గాయనిగా "గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌" పేరుతో చోటు దక్కించుకున్నారు. అనంతరం 1959లో టైమ్ మేగజైన్ కవర్ పేజీ స్టోరీగా లతా మంగేష్కర్ గురించి వ్యాసాన్ని ప్రచురించింది. ఆమెను భారతీయ నేపథ్య గాయకులు రాణిగా అభివర్ణించింది.