సోమవారం, 14 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (07:50 IST)

సీనియర్ హీరోయిన్ జయప్రదకు మాతృవియోగం

సీనియర్ నటి జయప్రద తల్లి నీలవేణి ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమె మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న జయప్రద ఢిల్లీ నుంచి హుటాహుటిన హైదరాబాద్ నగరానికి బయలుదేరి వెళ్లారు. 
 
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన నీలవేణి హైదరాబాద్ నగరంలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. అయితే, ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో కన్నుమూశారు. జయప్రద హీరోయిన్‌గా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి, రాణించడానికి ఆమె ఎంతగానో కృషి చేశారు. 
 
నటిగా అమ్మ నీలవేణి తనకు అన్ని విధాలుగా సహకరించి, ప్రోత్సహించారని పలు ఇంటర్వ్యూలలో జయప్రద చెప్పారు. కాగా, జయప్రద తల్లి నీలవేణి మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.