శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 23 జనవరి 2022 (12:55 IST)

ఆ పెద్దాయన బ్రెయిన్ వాష్ చేయడంతో అంజనమ్మను తిట్టాను.. సారీ అమ్మ : శ్రీరెడ్డి

మెగాస్టార్ చిరంజీవి అమ్మ అంజనాదేవికి నటి శ్రీరెడ్డి బహిరంగ క్షమాపణలు చెపుతూ ఓ వీడియోను విడుదల చేశారు. క్యాస్టింగ్ కౌచ్ పేరుతో శ్రీరెడ్డి పెద్ద ఉద్యమమే చేసింది. హైదరాబాద్ నగరంలో ఫిల్మ్ చాంబర్ ఎదుట కూర్చొని నానా హంగామా చేసింది. చిరంజీవి తల్లి అంజనాదేవితో సహా మహిళలందరిపైనా బూతుపురాణం లంఘించారు. ఇపుడు ఆమెకు సారీ చెబుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. 
 
ఇదే అంశంపై ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. "ఆడవాళ్ల కోసం నేను చేసిన ఉద్యమంలో నాయ్యం కోసం ఓ పెద్ద మనిషి వద్దకు వెళితే ఆయన నా బ్రెయినా వాష్ చేశారు. పైగా, ఆయన ఇచ్చిన సలహాతో చిరంజీవిగారి అమ్మఅంజనమ్మను తిట్టాల్సివచ్చింది. ఈ ఇష్యూతో ఏమాత్రం సంబంధం లేని ఆవిడని తిట్టడం ముమ్మాటికీ తప్పే. దానికి నేను శిక్ష అనుభవించాను. 
 
సోషల్ మీడియాలో కూడా చాలా ట్రోల్స్ ఎదుర్కొన్నాను. ఈ విషయంలో నేను ఇప్పటికీ బాధపడుతున్నాను. అన్యాయంగా ఆమెను తిట్టడం తప్పే. ఒప్పుకుంటున్నాను. నేను తప్పు చేశాను. బుద్దిగడ్డితిని అలా తిట్టాను. పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమించు అంజనమ్మా అంటూ శ్రీరెడ్డి పోస్ట్ చేశారు.