గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 19 జనవరి 2022 (14:14 IST)

ఆచార్య వాయిదా మ‌రి ఖిలాడి వ‌స్తుందా!

Khiladi poster
రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం `ఖిలాడి`.  ఈ చిత్రానికి సంబంధించిన ఒక్కో పోస్ట‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఫోర్త్ సింగిల్ కి సంబంధించిన ఒక అప్డేట్ ను చిత్ర యూనిట్ బుధ‌వారంనాడు తెలియ‌జేసింది. ఈ చిత్రం లోని ఫుల్ కిక్ మోడ్ ఫోర్ట్ సింగిల్ ను జనవరి 26వ తేదీన విడుదల చేస్తున్నారు.. అందుకు సంబంధించిన ఒక పోస్టర్ ను రిలీజ్ చేయడం జరిగింది. ఫిబ్రవరి 11 వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
 
ఇదిలా వుండ‌గా, ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల‌చేయాల‌నుకున్న చిరంజీవి `ఆచార్య‌` సినిమా వాయిదా వేసుకున్నారు. మ‌రి ర‌వితేజ ఖిలాడి గురించి ఇంత‌వ‌ర‌కు వాయిదా ప‌డుతున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించ‌లేదు. ఈ చిత్రాన్ని పెన్ మూవీస్, ఏ స్టూడియోస్ పతాకంపై సత్యనారాయణ కోనేరు,  రమేష్ వర్మ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మీనాక్షీ చౌదరీ, డింపుల్ హాయాతి లు నాయిక‌లు. అర్జున్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. త్వ‌ర‌లో ఖిలాడికి సంబంధించి విడుద‌ల తేదీ మ‌ర‌లా కొత్త‌గా ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.